Breaking News

ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలానే!

Published on Mon, 09/11/2023 - 19:19

ఏ హీరోయిన్ అయినా సరే అందానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అందంగా ఉంటేనే కదా ఆఫర్స్, డబ్బులు వచ్చేవి. ఈ బ్యూటీ కూడా అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ కుర్ర భామలందరూ అసూయ పడేలా తయారవుతుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలు కూతురితో కలిసి వర్కౌట్ చేస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇప్పటి జనరేషన్ కంటే 90స్ కిడ్స్‌ని అడిగితే టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్లకు ఆమె క్రష్ అని చెప్పొచ్చు. అవును.. మీలో కొందరు కరెక్ట్‌గానే ఊహించారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్రియ. సోమవారం ఆమె 42వ పుట్టినరోజు కావడం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

ఇకపోతే 2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసింది. అలా ఓ పదేళ్ల పాటు ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా చేస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తూ వచ్చింది.

ఈ మధ్య కొన్నాళ్లలో అయితే ఆర్ఆర్ఆర్, కబ్జ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో శ్రియ నటించింది. ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడ్ని 2018లో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా రాధ అనే పాప కూడా పుట్టింది. పైన ఫొటోలో శ్రియతో పాటు ఉన్నది ఈ పాపనే. అయితే మిగతా హీరోయిన్ల సంగతేమో గానీ.. శ్రియ మాత్రం గత 20 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ చాలామందికి క్వశ్చన్ మార్క్ అయిపోయిందనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)