Breaking News

సినీ నటి సీత ఇంట్లో విషాదం

Published on Sat, 01/04/2025 - 08:53

నటి సీత ఇంట్లో విషాదఛాయలు కమ్ముకున్నాయి. తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా ఆమె రాణించారు. 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్‌కు అక్కగా నటించి ఆమె  మంచి గుర్తింపు తెచ్చకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సీత టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. సీతకు మాతృవియోగం కలిగింది. ఈమె తల్లి చంద్రమోహన్‌ (88) శుక్రవారం చెన్నైలోని సాలిగ్రామంలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రావతి. 

సేలంకు చెందిన ఈమె చెన్నైకి చెందిన పీఎస్‌.మోహన్‌బాబును పెళ్లి చేసుకున్న తరువాత తన పేరును  చంద్రమోహన్‌గా మార్చుకున్నారు. వీరికి ఎంజీఆర్‌ పాండు, రాజమోహన్‌ అనే ఇద్దరు కుమారులతో పాటు కూతురు సీత ఉన్నారు. చంద్రమోహన్‌ గత 45 ఏళ్లుగా చెన్నైలోని జీహెచ్‌ ఆస్పత్రిలో నర్సుగా వైద్యసేవలు అందించారు. ఆ తరువాత స్థానిక సాలిగ్రామంలోని సూర్య ఆస్పత్రిలో 9 ఏళ్లు వైద్యసేవలు అందించారు. ఈమె భర్త పీఎస్‌.మోహన్‌బాబు నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. నటి సీతతో పాటు ఆమె సోదరులు సీనీ రంగానికి చెందిన వారే. సీత తండ్రి గత 10 ఏళ్ల క్రితమే కన్నుమూశారు. 

కాగా చంద్రమోహన్‌ మృతికి పలువురు సీనీ ప్రముఖులు అంజలి ఘటించి సీత కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌ భౌతికకాయానికి శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్థానిక అరుంబాక్కమ్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.

సీత  తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం. ఈమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ చెన్నైలో స్థిరపడ్డారు. 1990లో కెరీర్‌ పరంగా మంచి పీక్‌లో ఉన్నప్పుడే  నటుడు పార్థిబన్‌ను  ప్రేమ వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు రాఖీ అనే దత్తత తీసుకుకున్న కుమారుడు ఉన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ సినిమాలో కీర్తన నటించింది. ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు కూడా ఆమె అందుకుంది. పార్థిబన్‌తో విడిపోయిన తర్వాత సీరియల్ నటుడు సతీష్‌ను ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత అతనితో కూడా ఆమె విడిపోయారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)