Breaking News

నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా

Published on Wed, 08/13/2025 - 13:50

వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి.  ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్‌ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.

భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దు
ఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తరలించడం జరగదు, చంపేస్తారా?
తాజాగా హీరోయిన్‌ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్‌ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్‌ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్‌ ఆఫీస్‌, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్‌ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ప్రోగ్రామ్‌కు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.

మా జేబులో నుంచి తీస్తున్నాం
జంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. 

లోలోపలే చచ్చిపోతున్నా..
ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్‌ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్‌, చిన్మయి శ్రీపాద, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్‌.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు.

 

 

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్‌తో భార్య!

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)