Breaking News

మరోసారి సర్జరీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు: ఏడ్చేసిన రోహిణి

Published on Wed, 05/17/2023 - 16:45

ఎంతటి కష్టాన్ని అయినా, బాధను అయినా పైకి కనిపించనీయకుండా చేసే అస్త్రం చిరునవ్వు. ఆ నవ్వును అందరికీ పంచగల సత్తా ఒక్క కమెడియన్‌కే సొంతం. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తున్న కమెడియన్‌ రోహిణి చాలాకాలంగా భరించలేని బాధను అనుభవిస్తోంది. కానీ పైకి మాత్రం ఆ బాధను, నొప్పిని కనిపించనివ్వకుండా జాగ్రత్తపడుతోంది. 2016లో ఆమె యాక్సిడెంట్‌కు గురవగా కాలు ఫ్రాక్చర్‌ అయింది. దీంతో ఆమె కాలిలో రాడ్డు వేశారు.

కాలిలో రాడ్డు ఉన్నప్పటికీ టీవీ షోలలో గెంతుతూ, కుప్పిగంతులు వేస్తూ, డ్యాన్సులు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచింది రోహిణి. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె గతంలో కాలిలో వేసిన రాడ్డును తీయించుకోవాలనుకుంది. ఇందుకోసం ఇటీవలే ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు తీరా ఆ రాడ్డును తీయలేమంటూ చేతులెత్తేశారు. రాడ్డు లోపల కూరుకుపోయిందని, బలవంతంగా లాగితే దానికి అతుక్కున్న ఎముక విరిగే ప్రమాదం ఉందంటూ ఆ రాడ్డును అలాగే వదిలేశారు. 

దీంతో నిరాశకు లోనైన రోహిణి తన ప్రయత్నం విరమించలేదు. తనకు యాక్సిడెంట్‌ అయినప్పుడు సర్జరీ చేసిన డాక్టర్‌ దగ్గరకు వెళ్లి మళ్లీ సర్జరీకి సిద్దపడింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో రోహిణి మాట్లాడుతూ.. 'గంటలో సర్జరీ చేస్తామన్నారు. కానీ ఆ రాడ్డు రావడానికి 10 గంటలు పట్టింది. రాడ్డు సగందాకా వచ్చి ఆగిపోయిందట. చాలా కష్టపడి ఎలాగోలా దాన్ని బయటకు తీశారు. ఆరు వారాల దాకా కాలు కిందపెట్టకూడదన్నారు. చాలా కుట్లు వేశారు. ఎంతో నొప్పిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రోహిణి. ఆమె పరిస్థితి తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: కంగనా చేతబడి చేసిందన్నాడు, ఇప్పుడేమో అడ్డు రాలేదంటూ..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)