Breaking News

గిఫ్ట్‌గా చీర ఇచ్చిన 'ప్రభాస్‌'.. ఎందుకో చెప్పిన హీరోయిన్‌

Published on Tue, 12/30/2025 - 13:32

'ది రాజాసాబ్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మరాఠీ బ్యూటీ  రిద్ది కుమార్‌ మాట్లాడుతూ.. తనకు ప్రభాస్‌ గిఫ్ట్‌గా ఒక చీరను ఇచ్చారని చెప్పిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అదే చీరను ఈ కార్యక్రమం కోసం కట్టుకొని వచ్చానని ఆమె చెప్పింది. అయితే, రిద్ది కుమార్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఆమెకు చీర గిఫ్ట్‌గా ప్రభాస్‌ ఎందుకు ఇచ్చాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు వచ్చాయి. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు కారణం చెప్పింది.

ప్రభాస్‌ పుట్టినరోజు నాడు ఆయనకు ఒక గిఫ్ట్‌ను ఇచ్చానని అందుకు రిటర్న్‌గా ఒక చీరను ఇచ్చారని రిద్ది కుమార్‌ ఇలా చెప్పారు. 'మూడేళ్ల క్రితం నేను రాజా సాబ్‌ సెట్‌లో ఎంట్రీ ఇచ్చిన నాడే ప్రభాస్‌ పుట్టినరోజు.. ఆయనకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్నాను. ఆ సమయంలో కుదరలేదు. తర్వాత దీపావళి ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కర్ణుడి స్టోరీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రభాస్‌కు ఇచ్చాను. 

నిజజీవితంలో కూడా ప్రభాస్‌ స్వభావం కర్ణుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయనకు ఆ బుక్‌ ఇచ్చాను. దానికి రిటర్న్‌ గిఫ్ట్‌గా నాకు హనుమాన్‌ చాలీసా పుస్తకంతో పాటు కొన్ని చాక్లెట్స్‌,  వైట్‌ శారీ ఇచ్చారు.  ఆ సమయంలో చాలా ఎమోషనల్‌ అయ్యాను. నాటి నుంచి ఆ హనుమాన్‌ చాలీసా బుక్‌ నా బ్యాగ్‌లోనే ఉంది. అయితే,  కొద్దిరోజుల తర్వాత కల్కి సినిమాలో కర్ణుడిగా ప్రభాస్‌ నటించారని తెలిసి ఆశ్చర్యపోయాను.' అని రిద్ది కూమార్‌ చెప్పారు.

ది రాజా సాబ్‌ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)