Breaking News

రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?

Published on Sat, 07/12/2025 - 13:40

నటి రేణు దేశాయ్‌ (Renu Desai) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో తను పోస్ట్‌ చేసిన ఫోటోనే అందుకు కారణం. కూతురు ఆద్యతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన రేణు.. సెల్ఫీకి పోజిచ్చింది. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు రేణు దేశాయ్‌కు ఏమైందని కంగారుపడుతున్నారు. అయితే నటి మాత్రం తనకు ఏ సర్జరీ జరిగింది? ఎన్నిరోజులు ఆస్పత్రిలో ఉంది? వంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

సినిమా.. రీఎంట్రీ
రేణు దేశాయ్‌.. తెలుగులో బద్రి, జానీ సినిమాలు చేసింది. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం రేణు.. సినిమాలకు దూరమైంది. ఈ జంటకు కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్య సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌.. టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రెండు సినిమాలకు సంతకం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

చదవండి: మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)