Breaking News

షాకింగ్‌ విషయం బయటపెట్టిన పవన్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌

Published on Tue, 02/14/2023 - 13:29

తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు ఈమధ్య కాలంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలె సమంత మయోసైటిస్‌ బారిన పడగా, మమతామోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తాజాగా మరో నటి, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది.

''నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకి తెలుసు గత కొన్నాళ్లుగా నేను గుండె, ఇతర హెల్త్‌ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్‌ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి.

ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది.  జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది.  మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే దీన్నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటాను'' అంటూ రేణూ దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కానీ తనకున్న అనారోగ్యం ఏంటన్నది మాత్రం ఆమె పూర్తిగా రివీల్‌ చేయలేదు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)