Breaking News

రాత్రికి రేటెంత అని అడిగారు.. ఇదేనా మీ సంస్కారం?

Published on Sat, 02/28/2026 - 19:49

కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్య కామెంట్స్‌ చేస్తున్నారని వాపోయింది నటి రేణూ దేశాయ్‌. తనపై ఇంత ద్వేషం ఎందుకని మండిపడింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 2012లో నాకు విడాకులైనప్పటినుంచి నా గురించి రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. భరణం తీసుకున్నానని, నా వ్యక్తిగత జీవితం గురించి, ఏ రాజకీయ పార్టీకి బానిస అని.. ఇలా రకరకాలుగా తిడుతూనే వచ్చారు. 

నేను రానన్నాను
ఇక నాపై కామెంట్స్‌ చేసేందుకు ఏం మిగల్లేదు అనుకున్నాను. అది తప్పని అర్థమైంది. జనవరిలో కుక్కల కోసం ఓ ప్రెస్‌మీట్‌లో కూర్చున్నాను. నిజానికి అప్పుడు కూడా నేను ప్రెస్‌మీట్‌కు రాననే చెప్పాను. నేను ఏం మాట్లాడినా తిడతారే తప్ప ఎటువంటి సమాధానం దొరకదు అని చెప్పాను. కానీ, కొన్ని ఎన్జీవోలు నన్ను రమ్మని మరీమరీ అడిగారు. వందలాది కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు. మీరు కచ్చితంగా మాట్లాడాలన్నారు. అంత పెద్ద సంఖ్యలో కుక్కల్ని చంపేస్తుంటే నాకూ బాధేసింది.

నానా బూతులు తిట్టారు
అందుకే ప్రెస్‌మీట్‌కు వచ్చాను. వంద కుక్కల్లో పది పిచ్చి కుక్కలుంటాయి. ఆ పదింటికోసం 90 మంచి కుక్కల్ని చంపొద్దన్నాను. అందులో ఏం తప్పు మాట్లాడాను? నేను చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా దాన్ని వక్రీకరిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. నన్ను నానా బూతులు తిట్టారు. నేనేదైనా సినిమా చేస్తే మీ యాక్టింగ్‌ బాలేదు అని చెప్పండి.. తప్పుపట్టను. కానీ, నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం దేనికి? 

అందుకే అంత కోపం
ఇష్టమొచ్చిన బూతులు తిట్టడం ఏం సంస్కారం? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మీ ఇంట్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు మీరు ఎటువంటి కామెంట్స్‌ పెడుతున్నారో చూపించండి. ప్రెస్‌మీట్‌లో ఎవరో తెలియని వ్యక్తి లోపలకు వచ్చి దున్నపోతు అని తిట్టాడు. అందుకే కోప్పడ్డాను. అది అర్థం చేసుకోకుండా నాకు రేబిస్‌ వచ్చింది అంటూ దారుణమైన పదజాలంతో దూషించారు. ఒక ఘోరమైన కామెంట్‌ చూసి నేను చాలా షాకయ్యాను. 

కుక్కల వల్ల హాని
ఈ పిచ్చికుక్కలు రేణూదేశాయ్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ను కరిస్తే తనకు ఆ బాధేంటో తెలుస్తుంది అన్నారు. ఇదేం భాష? ఆ ఆలోచనలు ఏంటి? మీ అమ్మానాన్న మిమ్మల్ని ఏం సంస్కారంతో పెంచారో నాకర్థం కావడం లేదు. ఆడమగ తేడా లేకుండా అందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుక్కల వల్ల ఎవరికైనా హాని కలుగుతుంటే వాటి బెడద ఎక్కువగా ఉందని మీ కార్పొరేటర్‌తో, మీ ఎమ్మెల్యేతో పోరాడండి. అంతే తప్ప మీకు నన్ను తిట్టే హక్కు లేదు.

నేనేం చేశా?
ఏదో ఒక రోజు ఈ తిట్ల దండకం ఆపేస్తారులే అని అంతా భరించాను. కానీ, మొన్న కులాల మధ్య గొడవలో ఒక బిడ్డ ప్రాణం పోతే నన్నే తిడుతున్నారు. ఇందులో నా ప్రమేయం ఎక్కడుంది? ఇక భరించడం నా వల్ల కాదు. ఎక్కడైనా బూతు కామెంట్స్‌ కనిపించాయంటే మీ ఇంటివరకు వస్తాను. మీ అమ్మానాన్న, అక్కచెల్లెళ్లకు మీరు పెట్టిన బూతుల కామెంట్‌ చూపించి ఇదేనా మీరు నేర్పిన సంస్కారం అని అడుగుతాను.

బండబూతులు తిట్టండి
నేను కాశీకి వెళ్లినందుకు కూడా విమర్శించారు. నిండుగా ధరించిన దుస్తులు వేసుకున్న ఫోటో షేర్‌ చేస్తే కూడా రాత్రికి రేటెంత? అని అడిగారు. బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నారు? నన్ను తిడితే మీకొచ్చే ప్రయోజనం ఏంటి? ఒక పని చేద్దాం.. నేను పబ్లిక్‌ ముందు వచ్చి కూర్చుంటాను. నన్ను, నా పేరెంట్స్‌ను, పిల్లల్ని అందర్నీ బండబూతులు తిట్టండి. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏదైనా ఒక ప్రాణం నిలబడుతుందా? చెప్పండి. మీకు దమ్ముంటే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేని బూతులు తిట్టండి అని రేణూ దేశాయ్‌ ఆగ్రహించింది.

 

 

చదవండి: కాస్ట్‌లీ హీల్స్‌ ధరించిన నిక్కీ..  ఆ చెప్పుల ధర వేలల్లో కాదు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)