Breaking News

'మూడేళ్లుగా వేధింపులు.. తట్టుకోలేకపోతున్నా': నటి ఆవేదన

Published on Thu, 02/05/2026 - 21:10

'లవ్ టుడే', 'మామన్నన్' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె తన వాయిస్‌ ఇచ్చింది. తెలుగులో  ఓకే బంగారం, ప్రేమమ్‌, 2.0, నవాబ్‌ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది.

అయితే తాజాగా తాను వేధింపులకు గురైనట్లు రవీనా వెల్లడించింది. సోషల్ మీడియాలో మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. "ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్నా.. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. మూడేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై  వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా స్నేహితులుస, కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్‌ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్‌తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్‌ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా...రవీనా రవి జవాన్‌ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్‌ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్‌.మాళవిక మోహన్‌,శ్రీనిధి శెట్టి, అమలా పాల్‌,రాశీ ఖన్నా,కాజల్‌ అగర్వాల్‌, సమంత వంటి స్టార్‌ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్‌ చెప్పింది. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)