Breaking News

కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్‌

Published on Sat, 08/31/2024 - 11:16

మలయాళ 'చిత్రపరిశ్రమ'లో మహిళలపై వేధింపుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎందరో నటీనటులు తమ అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ రాధిక శ‌ర‌త్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి ఇబ్బందులనే మహిళలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.

నటీమణులకు కేటాయించిన కారవాన్‌లలో కొందరు సీక్రెట్‌ కెమెరాలు పెట్టి ఆపై వారి ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయని రాధిక ఆరోపించారు.  ' ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా నేను కేరళ వెళ్లాను. అప్పుడు సెట్‌లో జరిగిన ఒక సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. షూట్‌ ముగించుకుని నేను అటుగా వెళ్తున్న సమయంలో  కొంతమంది మగవాళ్లు ఒకచోట గుమికూడి ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. కానీ, వారందరూ ఒక వీడియో చూస్తున్నారని నాకు అర్థమైంది. వెంటనే సినిమా యూనిట్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరిని పిలిచి.. వారు ఏం చేస్తున్నారో చూడమని పంపాను. 

అయితే, అప్పుడు నాకు షాకింగ్‌ విషయం తెలిసింది. కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి ఆపై మహిళల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి ఫోన్‌లో చూస్తున్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అక్కడ చిత్ర యూనిట్‌కు ఫిర్యాదు చేశాను. ఆ సంఘటన జరిగి చాలా ఏళ్లు అయింది. అయినా, ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు భయం. ఆరోజు నుంచి నేను కారవాన్‌ ఉపయోగించాలంటే భయపడుతాను. అని రాధిక అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)