Breaking News

ఫస్ట్‌ సినిమా.. డబ్బులివ్వలేదు, దారుణంగా చూశారు

Published on Thu, 12/18/2025 - 13:23

బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్‌ లైఫ్‌ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్‌లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్‌ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

చేదు అనుభవం
రాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్‌ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్‌ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్‌) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.

దారుణంగా..
కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్‌ చేశారు. అందుకే నా ఫస్ట్‌ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..

ఆయనే న్యాయ నిర్ణేత
సినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్‌ సర్జన్‌ అనే నాటకం వేశాను. మా టీమ్‌కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్‌లో దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్‌లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.

సినిమాలు
రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్‌, లయన్‌ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్‌, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, సేక్రెడ్‌ గేమ్స్‌, ఓకే కంప్యూటర్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్‌ అనే థ్రిల్లర్‌ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.

చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు