Breaking News

'సాంగ్ షూట్.. హీరో ముద్దులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు'

Published on Sun, 06/07/2026 - 16:10

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్‌తో పాటు ఇంటిమేట్‌ సీన్స్ కూడా ఉంటాయి. కథకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా నటీనటులు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అయితేనే ముద్దు సీన్‌ అంత బాగా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. అలాంటి ఈ సీన్స్‌లో ఒక్కోసారి అభ్యంతరం రావడం కూడా సహజమే. తాజాగా ఓ నటి ముద్దు సీన్‌లో తనకెదురైన అనుభవాన్ని షేర్ చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా బాపత్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఓ సాంగ్‌ షూట్‌లో హీరో తనను పదేపదే ముద్దు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించింది. ఆ టైమ్‌లో తాను ఎలా స్పందించాలో.. ఎలా సమర్థించుకోవాలో తెలియలేదని అన్నారు. షూటింగ్ తర్వాత కూడా ఆ సీన్ తన మైండ్‌లో నుంచి పోలేదని చెప్పారు. అయితే ఆ ముద్దు సన్నివేశంపై తాను మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేశానని ప్రియా తెలిపారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లలో దాని అవసరం గురించి దర్శకుడిని ప్రశ్నించానని ప్రియా బాపత్ వెల్లడించారు. ఆ సన్నివేశం కంటే సహనటుడి ప్రవర్తన హద్దులు దాటిందని ఆమె ఆరోపించారు.

అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తామిద్దరూ ఒకే హోటల్‌లో బస చేశామని వెల్లడించింది. తాను చాలాసార్లు వద్దని చెప్పినప్పటికీ నా సహనటుడు అల్పాహారం, రాత్రి భోజనానికి తనతో  కలిసి చేయాలని పదేపదే అడిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తనను తీవ్రంగా కుంగదీసిందని తెలిపింది. తన పరిస్థితి గురించి ప్రతి రాత్రి తన భర్త ఉమేష్ కామత్‌కు ఫోన్ చేసేదాన్నని చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్త  కామత్ ముంబయి నుంచి సినిమా షూటింగ్ జరుగుతున్న భోపాల్‌కు వచ్చి మూడు రోజుల పాటు ఆమెతో పాటే ఉన్నారని వెల్లడించింది.

కాగా.. ప్రియా బాపత్  మరాఠీ చిత్రసీమలో ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. 'కాక్‌స్పర్శ్', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో  నటనకు ఆమె బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా హ్యాపీ జర్నీ (2014), ఆమ్హీ దోగీ (2018), అంధేరా,  రాత్ జవాన్ హై లాంటి ప్రాజెక్ట్‌ల్లో కనిపించింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)