Breaking News

రాజకీయాల్లో ఎంట్రీపై హీరోయిన్‌కు ప్రశ్న.. నెటిజన్‌కు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!

Published on Tue, 04/29/2025 - 15:12

బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్‌తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.

ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్‌ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్‌ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. 
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)