Breaking News

నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!

Published on Tue, 07/18/2023 - 17:13

నటి ప్రగతి.. ఈ పేరు చెప్పగానే తల్లి, అత్త పాత్రలు చేసే నటి గుర్తొస్తుంది. తనదైన యాస, యాక్టింగ్ తో నవ్వించే ఈమె.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఓవైపు నటిగా ఎంటర్‪‌టైన్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్‌తో బాగా పాపులర్ అయింది. అవన్నీ సరదాగా చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టేసింది. 

హీరోయిన్‌గా చేసింది గానీ
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్‪‌గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది కానీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. అలా అలా కొన్నాళ్లకు సినిమాల్లో సహాయపాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి.

(ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!)

లిఫ్టర్‌గా కొత్త జర్నీ
మహేశ్‌బాబు 'బాబీ' సినిమాతో సెకండ్  ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రగతి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. లాక్‌డౌన్ టైంలో ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. అయితే అవన్నీ సరదాకి అనుకున్నారు. ఇప్పుడు నిజంగానే పవర్ లిఫ్టర్ గా మారిపోయి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

టార్గెట్ పెద్దదే
'కొత్త జర్నీ మొదలైంది. రెండు నెలల క్రితం నా జీవితం  ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. అయితే టార్గెట్ చాలా పెద్దదే. దాన్ని చేరేవరకు తగ్గేదే లే' అని ప్రగతి తన ఇన్ స్టా వీడియో క్యాప్షన్ రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)