Breaking News

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. నా భవిష్యత్తును ఆగం చేయొద్దు!

Published on Thu, 04/24/2025 - 16:43

పవిత్ర లక్ష్మి (Pavithralakshmi).. ఈ తమిళమ్మాయి ఓ కాదల్‌ కణ్మని (2015) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ మూవీలో అతడి కొలీగ్‌గా చిన్న పాత్రలో కనిపించింది. అదే ఏడాది ఈమె మిస్‌ మద్రాస్‌ కిరీటాన్ని సైతం గెల్చుకుంది. కూకు విత్‌ కోమలి అనే కుకింగ్‌ షోలో పాల్గొని ఎక్కువ ఫేమస్‌ అయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే నాయి శేఖర్‌ (తమిళ చిత్రం), ఉల్లాసం (మలయాళం), అదృశ్యం(తమిళ, మలయాళం) అనే సినిమాలు చేసింది. జిగిరీ దోస్తు, వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ మద్రాస్‌ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది.

ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు
అయితే ఈ బ్యూటీ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందంటూ ఈ మధ్య పుకార్లు వైరల్‌గా అయ్యాయి. ఈ రూమర్లపై పవిత్ర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా లుక్‌ మారడం, బరువు పెరగడంతో నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని కామెంట్లు అయితే చెప్పడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఉన్నాయి.

నా భవిష్యత్తు ఆగం చేయొద్దు
అందుకే మీ అందరికీ మరోసారి చెప్తున్నా.. నేను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. దయచేసి మీ వినోదం కోసం నా గురించి లేనిపోని వార్తలు రాయొద్దు. నాపై రూమర్లు సృష్టించకండి. నాకంటూ ఓ జీవితం ఉంది.. దయచేసి నా పేరు చెడగొట్టకండి.. నా భవిష్యత్తును ఆగం చేయకండి. కొంత ప్రేమ, మరికొంత గౌరవం.. మీనుంచి ఈ రెండే కోరుకుంటున్నా.. మీరెప్పుడూ నాపై ప్రేమాభిమానాలే చూపించేవారు. దాన్ని అలాగే కొనసాగించండి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని పవిత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

 

 

చదవండి: బిగ్‌బాస్‌ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్‌ ఇదే!

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు