Breaking News

పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు

Published on Fri, 07/04/2025 - 15:43

పాకీజా (Actress Pakeezah Vasuki) పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీలో నటి వాసుకి.. పాకీజాగా బ్రహ్మానందంతో కలిసి చేసే కామెడీ భలే ఉంటుంది. అందుకే.. ఎన్నో సినిమాల్లో నటించినా సరే తన పేరు పాకీజాగానే స్థిరపడిపోయింది. వాసుకి.. పెదరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ ఇలా అనేక సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది.

కష్టాలు తీరాయనుకునేలోపే..
ఈ విషయం తెలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు తనకు అండగా నిలిచారు. తోచిన సాయం చేశారు. దీంతో ఆమె కష్టాల నుంచి గట్టెక్కినట్లే అని అంతా అనుకునేలోపే తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. ఇటీవల మరోసారి మీడియా ముందుకు వచ్చి తనకు పూట గడవడమే గగనంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అందరూ సాయం చేసినా తిరిగి మళ్లీ కష్టాల ఊబిలోకి కూరుకుపోవడానికి గల కారణాన్ని పాకీజా తాజాగా బయటపెట్టింది.

దుబారా చేయలేదు
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు రూ.7.5 లక్షల దాకా సాయం అందింది. ఆ డబ్బు నేను వృథాగా ఖర్చు చేయలేదు. మూడున్నర లక్షల అప్పు తీర్చేసుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటికి అడ్వాన్స్‌ ఇచ్చాను. వంటసామాగ్రి కొనడం.. ఇక్కడినుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లడం.. ఇలా వీటికే డబ్బంతా అయిపోయింది.

అద్దె కట్టడమే కష్టంగా..
ఇక్కడ అవకాశాలు లేవని తమిళనాడు వెళ్లిపోయాను. అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి కష్టమైపోయింది. ఇంట్లో పాచిపని చేస్తానంటే కూడా ఎవరూ పనివ్వడం లేదు, అదేమంటే నేను నటినని దూరం పెడుతున్నారు. ఆరు నెలల్లో పిచ్చిదాన్నైపోతానేమో అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేది. ఉదయం, సాయంత్రం ఇడ్లీ చేసుకునేదాన్ని.

కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా
మధ్యాహ్నం గంజి తాగేదాన్ని. నాన్‌వెజ్‌ మర్చిపోయి చాలాకాలమే అవుతోంది. ఇప్పుడు వచ్చిన రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను. పొదుపుగా వాడుకుంటాను. ఇంకెన్నడూ సాయం కోసం అడగను అని పాకీజా కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ బ్యూటీ మిత్రా శర్మ.. పాకీజాకు రూ.50 వేలు సాయం చేసింది.

చదవండి: సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్‌ వెంకట్‌ కూతురు.. 'ప్రభాస్‌' సాయం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)