Breaking News

విపరీతమైన నొప్పితో విలవిల్లాడా, వాళ్లు లేకపోయుంటే.. ఏడ్చేసిన నటి

Published on Fri, 04/05/2024 - 19:52

గ్లామర్‌ రోల్స్‌ చేస్తే డబ్బులు రాలతాయి. క్రేజ్‌ దక్కుతుంది. కానీ అది కొంతకాలమే! గ్లామర్‌ రోల్స్‌ చేసినవారికి మలి వయసులో అమ్మ, నానమ్మ లాంటి పాత్రలు రావడం కష్టమే అవుతుంది. జయలలితకు అలాంటి పరిస్థితే ఎదురైంది. హీరోయిన్‌ ముంతాజ్‌ది మరో రకమైన గోడు! అలాంటి పాత్రలు ఎందుకు చేశానా? అనిపిస్తోందని బాధఫడుతోంది ముంతాజ్‌.

పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీకి దూరం
అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, చాలాబాగుంది, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, పెళ్లి కాని పెళ్లాం అవుతుంది, ఆగడు, టామీ చిత్రాల్లో అతిథి పాత్రలో, ఐటం సాంగ్స్‌లో మెరిసింది. తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించింది. 2015 తర్వాత వెండితెరపై కనిపించకుండా పోయిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది.

నొప్పితో గిలగిల్లాడా..
ముంతాజ్‌ మాట్లాడుతూ.. 'ఒకరోజు నాకు విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. ఎటూ కదల్లేకపోయాను. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్లు ఆ నొప్పిని అలాగే భరించాను. ఆ తర్వాత నాకు ఆటో ఇమ్యూన్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాని వల్ల నొప్పులతో విలవిల్లాడిపోయేదాన్ని. కీళ్ల జాయింట్‌ వద్ద సమస్య వల్ల కూర్చోలేకపోయేదాన్ని. సరిగా నిలబడలేకపోయేదాన్ని. శరీరాన్ని కదిలించడమే కష్టమయ్యేది.

డిప్రెషన్‌
ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకునేదాన్ని. బయటకు మాత్రం అదేదీ కనిపించకపోవడంతో నాకేముంది, బాగానే ఉన్నాననుకునేవారు. ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలిసేది కాదు, కానీ రోజంతా ఏడుస్తూ ఉండేదాన్ని. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింది. ఆ సమయంలో కుటుంబం నాకు తోడుగా ఉండకపోయుంటే చచ్చిపోయేందుకు ప్రయత్నించేదాన్ని.

ఆ ఫోటోలు మాత్రం షేర్‌ చేయొద్దు
ఒకప్పుడు గ్లామర్‌ రోల్స్‌ చేసినందుకు ఇప్పుడు ఇబ్బందిపడుతున్నాను. నా దగ్గర బోలెడంత డబ్బుంటే దాని సాయంతో ఆ ఫోటోలన్నీ ఇంటర్నెట్‌లో డిలీట్‌ చేయాలనుంది. కానీ అది నా వల్ల అయ్యేది కాదు. దయచేసి అభిమానులెవరూ నా గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చేయకూడదని కోరుకుంటున్నాను. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్‌ చేయకండి. పెళ్లంటారా? మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ముంతాజ్‌ ఎమోషనలైంది.

చదవండి: OTT: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
ప్రియుడితో రెండో పెళ్లి.. గ్రాండ్‌గా సీమంతం వేడుక!

Videos

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

టికెట్లు నిల్! 70 ఏళ్ల కుర్రోడి స్టామినా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు!

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్