అంబులెన్స్‌ నడపడం సవాల్‌ అనిపించింది: మృణాల్‌ ఠాకూర్‌

Published on Mon, 04/06/2026 - 00:21

‘‘సీతారామం, హాయ్‌ నాన్న, ఫ్యామిలీ స్టార్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. నేను మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారిలో ఏర్పడింది. ‘డెకాయిట్‌’లో చేసిన సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు మృణాల్‌ ఠాకూర్‌. అడివి శేష్, మృణాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్‌ నారంగ్‌ సహ–నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మృణాల్‌ ఠాకూర్‌ చెప్పిన విశేషాలు. 

‘డెకాయిట్‌’ ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీ మూవీ. ఈ చిత్రంలో నేను సరస్వతి పాత్రలో, హరి పాత్రలో శేష్‌ నటించాం. హరి, సరస్వతి ఎందుకు డెకాయిట్స్‌గా మారారనేది సినిమాలో చూడాలి. సరస్వతి క్యారెక్టర్‌ నాకో సవాల్‌. ఈ సినిమా కోసం కొన్ని స్టంట్, చేజింగ్, డ్రైవింగ్‌ సన్నివేశాలు చేశాను. అంబులెన్స్‌ కూడా నడిపాను. చాలా స్పీడ్‌గా డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్‌కు హ్యాండ్‌ బ్రేక్‌ లేదు. ఇలాంటి రిస్కీ సీన్స్‌ కూడా చేశాను. 

‘సీతారామం, హాయ్‌.. నాన్న, ఫ్యామిలీ స్టార్‌’లను తెలుగులోనే తీశాం. కానీ ‘డెకాయిట్‌’ను తెలుగు, హిందీ భాషల్లో చేశాం. నాకైతే తక్కువ రెమ్యునరేషన్‌తో రెండు సినిమాలు చేసిన ఫీలింగ్‌ కలిగింది (సరదాగా). ఈ సినిమాలో ఓ సీన్‌లో బురదలో నటించాల్సి వచ్చింది. కానీ మేకర్స్‌ నా ఫేస్‌ గురించి ఆలోచించి బురద బదులు చాక్లెట్‌ను ప్లాన్‌ చేశారు. ఇలా చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. షానియల్‌గారు అద్భుతమైన డైరెక్టర్‌. ఓ మంచి సినిమా చేసిన ఫీలింగ్‌ నాకు ఉంది.

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)