Breaking News

డిప్రెషన్‌.. చనిపోవాలని చాలాసార్లు ట్రై చేశా..: హీరోయిన్‌

Published on Sun, 09/14/2025 - 13:58

ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్‌ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది.  మోహిని- భరత్‌ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని. 

డిప్రెషన్‌లో..
నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్‌ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు. 

దాన్నుంచి బయటపడ్డా..
మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్‌ అయింది.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్‌లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్‌ మ్యాన్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)