amp pages | Sakshi

63 ఏళ్ల టాప్‌ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా

Published on Sat, 04/13/2024 - 15:31

కోలీవుడ్‌లో రెండు దశాబ్దాలకు పైగా ప్రముఖ హీరోగా కొనసాగిన సీనియర్‌ నటుడు రామరాజన్‌.. 2001 వరకు వరుసగా సినిమాల్లో కనిపించిన ఆయన ఆ తర్వాత పెద్దగా వెండితెరపై కనిపించలేదు. 2010లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రామరాజన్‌ బయటిప్రపంచానికి కూడా టచ్‌లో లేకుండాపోయారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ ఒక సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు..  ‘సామానియన్‌’  అనే చిత్రం ద్వార ఆయన రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 63ఏళ్లు కాగా ఆయన సరసన మీనా నటిస్తే కథకు బాగా సెట్‌ అవుతుందని ఆయన భావించారట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.

1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామరాజన్‌ తన 18వ సినిమా  'కరగట్టకరణ్' సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇది 25 కేంద్రాలలో 100 రోజులు, ఎనిమిది కేంద్రాలలో 360రోజులు, నాలుగు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శించబడింది. అలా ఆయన 45 సినిమాల్లో హీరోగా నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువగా ఆయన సినిమాల్లో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ 23 ఏళ్ల తర్వాత ‘సామానియన్‌’ చిత్రం కోసం పనిచేస్తున్నారు.

ఈ సినిమాలో రామరాజన్‌ లాయర్‌గా నటిస్తున్నారు. దీంతో తన సరసన సీనియర్‌ హీరోయిన్‌ 'మీనా' అయితే బాగుంటుందని దర్శకుడు ఆర్‌. రాకేష్‌ ద్వారా ఆమెను సంప్రదించారట. అందుకు మీనా అంగీకరించలేదట.  కొన్ని కారణాల వల్ల రామరాజన్‌ సినిమాలో నటించలేనని మీనా తెలిపిందని అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

రజనీ-కమల్ లాంటి హీరోలను ఢీ కొట్టిన నటుడు రామరాజన్‌. అలాంటి హీరోతో నటించనని మీనా చెప్పడం ఏంటి..? అంటూ ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అదే రజనీకాంత్‌ సినిమాలో మీనాకు ఛాన్స్‌ వస్తే వదులుకుంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా పలురకాలుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు విషయం తెలియాలంటే మీనా చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. 1998లో తిరుచెందూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామరాజన్‌ భారీ మెజరాటీతో గెలిచి ఎంపీగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నారు.

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?