Breaking News

ఆ హీరోను ఇష్టపడ్డా.. చెల్లి అని పిలిచాడు: హీరోయిన్‌

Published on Thu, 09/18/2025 - 20:08

హీరోయిన్‌ మహేశ్వరి (Actress Maheswari) గుర్తుందా? ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇటీవల ఆమె జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్‌ షోకి హాజరైంది. ఈ సందర్భంగా ఓ హీరోపై తనకున్న క్రష్‌ను బయటపెట్టింది. మహేశ్వరి మాట్లాడుతూ.. 'హీరో అజిత్‌ కుమార్‌ అంటే నాకు క్రష్‌. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. తనతో రెండు సినిమాలు చేశాను. 

షూటింగ్‌ చివరి రోజు..
ఓ మూవీ షూటింగ్‌ సాగదీయడం వల్ల ఏడాదిన్నర పాటు తనతో కలిసి పని చేశాను. అంతా అయ్యాక షూటింగ్‌ చివరి రోజు ఊహించనిది జరిగింది. అసలే ఆయన్ను మళ్లీ కలవలేనని బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో అజిత్‌ నా దగ్గరకు వచ్చి మహి, నువ్వు నా చెల్లెలిలాంటిదానివి. నీ జీవితంలో ఎప్పుడు, ఏం అవసరమొచ్చినా దయచేసి నన్ను అడుగు.. నేను నీకోసం ఉన్నాను అని చెప్పాడు. అలా నా క్రష్‌ నన్ను చెల్లి అని పిలిచాడు' అని గుర్తు చేసుకుంది.

సినిమా
మహేశ్వరి.. 1994లో కరుత్తమ్మ సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. గులాబి సినిమాతో సెన్సేషన్‌ అయింది. దెయ్యం, పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ.. ఇలా అనేక సినిమాలు చేసింది. అజిత్‌తో ఉల్లాసం, నేశం సినిమాల్లో నటించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొంతకాలం పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఆమె ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తోంది.

చదవండి: ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే