Breaking News

నన్ను లాగిపెట్టి కొట్టారు.. నేనూ ఆయన చెంప చెళ్లుమనిపించా

Published on Sun, 06/07/2026 - 12:21

సినిమాల్లో జరిగిదేంతా నిజం కాదని అనుకుంటూ ఉంటాం. అయితే అప్పుడప్పుడు షూటింగ్ సందర్భంగా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి సదరు హీరో లేదా హీరోయిన్ చెబితే తప్పితే తెలియదు. ఒకప్పటి హీరోయిన్ మధుబాల కూడా గతంలో తను ఓ హిందీ మూవీ సందర్భంగా ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టింది. తన చెంపపై నటుడు లాగిపెట్టిన విషయం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే)

'యశ్వంత్ సినిమా షూటింగ్‌లో నానా పటేకర్(హీరో)కి నాకు గొడవ జరిగే సీన్ అది. ఆయన ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అయినా తేలిగ్గా పండిస్తారు. నేను అంత సహజంగా నటించలేను. మా ఇద్దరి మధ్య గొడవ జరిగేటప్పుడు నేను ఏడవాలి. కానీ కన్నీళ్లు రావట్లేదు. బాధగానూ అనిపించలేదు. అప్పుడు గ్లిజరిన్‌తో ప్రయత్నిద్దామనుకుంటే.. నానా పటేకర్ నా చెంపపై లాగిపెట్టి కొట్టారు. విపరీతమైన బాధతో పాటు ఆయనపై చాలా కోపం వచ్చింది. వెంటనే నేను కూడా ఆయన చెంప చెళ్లుమనిపించాను. అంతే మా డైరెక్టర్ కట్ చెప్పారు. ఒక్కదెబ్బతో అనుకున్నట్లుగా వచ్చిందని అనిల్ హ్యాపీగా ఫీలయ్యారు. నానా పటేకర్ ఎందుకు కొట్టారో అప్పుడు అర్థమైంది. ఆయన మంచి మనిషి. సహనటులతో గౌరవంగా ఉండేవారు. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు' అని మధుబాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

1997లో వచ్చిన ఈ సినిమాలో నానా పటేకర్, మధుబాలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈమె..'రోజా' సినిమాలో దక్షిణాదిలో ఫేమస్ అయింది. ప్రస్తుతం అడపాదడపా తల్లి పాత్రలు చేస్తోంది. గత కొన్నేళ్లలో అయితే తెలుగులో సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో, శాకుంతలం, కన్నప్ప తదితర మూవీస్‌లో నటించింది.

(ఇదీ చదవండి: టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు