Breaking News

రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని ‍అడిగారు: సీనియర్ నటి

Published on Wed, 02/08/2023 - 14:23

కుట్టి పద్మిని సౌత్‌ ఇండియా సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించిది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైన నటులతో కలిసి నటించింది. ఆమె నటనకు తమిళనాడు రాష్ట్రం జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్న తొలినటిగా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పద్మిని మాట్లాడూతూ.. 'అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అప్పట్లో సావిత్రి, జమున ఉన్న సమయం. అప్పట్లో దర్శకులు కొంచెం అడ్జస్ట్‌మెంట్లు చేస్తారా అని అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. నాకు గ్లామర్ డ్రెస్ అంటే ఇష్టముండదు. అలాంటి డ్రెస్సులు నాకు నచ్చవు. నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. అలా కొన్ని సినిమాలు మిస్సయ్యా. హీరోయిన్‌గా చాలా అవకాశాలు వదులుకున్నా. నాకన్న శ్రీదేవి బాగా ఫేమస్ అయింది. ఆ అదృష్టం నాకు రాలేదు.' అని అన్నారు.

అనంతరం పద్మిని మాట్లాడూతూ.. 'కానీ నేను ఇప్పుడు రోజు 140 మందికి జీతాలు ఇస్తున్నా. ఎవరెవరు నాకు అవకాశం ఇవ్వలేదో వారికే నేను ఉపాధి కల్పించా. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఎవరైతే నన్ను రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలని పిలిచారో వారికే సాయం చేస్తున్నా. నేను బాగున్నానంటే నేను చేసిన పనులే.  నా భర్త పెళ్లయిన 22 ఏళ్ల తర్వాత నా సెక్రెటరీని లవ్ చేశారు. పెళ్లయి పిల్లలు కన్నాక సడన్‌గా భర్తపై కోపం ఎలా వస్తుంది. నేను అడ్జస్ట్ చేసుకుని ఉండాలి లేదా ఒంటరిగా ఉండాలి. నేను ఒంటరిగానే ఉంటున్నా. చాలా సంతోషంగా ఉన్నా' అని అన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)