Breaking News

నటి కార్తికకు దుబాయ్‌ ప్రభుత్వం అరుదైన గౌరవం

Published on Mon, 03/20/2023 - 17:48

సీనియర్‌ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందుకుంది. దుబాయ్‌లోని ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషిస్తుంది కార్తిక. ఈ క్రమంలో కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్‌ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్‌ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: మోహన్‌ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?

‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్‌ అన్నారు. కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్‌ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్‌ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్‌ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)