Breaking News

స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్‌.. తల్లి హీరోయిన్, తండ్రి డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Mon, 02/26/2024 - 19:52

హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్‌లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)

మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్‌తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా.

ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)