Breaking News

నటిపై తండ్రే సంచలన కామెంట్‌.. పోలీసులకు ఫిర్యాదు

Published on Fri, 08/01/2025 - 08:26

టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌ పేరు కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వైరల్అవుతూనే ఉంది. తాజాగా తనపై తండ్రే ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ప్రిజం పబ్యాజమాన్యం ఆమెపై కేసు పెట్టింది. బిల్చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. అయితే, అదంతా అబద్దం అంటూ ఆమె వివరణ ఇచ్చింది. రీసెంట్గా హైదరాబాద్నగర శివారులోని ఓ రిసార్ట్కు వెళ్లిన కల్పిక అక్కడ కూడా గొడవ చేసింది. సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని అతనిపై ఫైర్అయింది. వీడియో కూడా నెట్టింట వైరల్అయింది. దీంతో ఆమె మళ్లీ వివరణ ఇచ్చింది. ప్రశాంతత కోసం రిసార్ట్కు వెళ్లినా తనకు ఎలాంటి ప్రశాంతత దక్కలేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు. మంచి డాక్టర్ను చూసి మానసిక వైద్యం కోసం ట్రీట్మెంట్తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే, తాజాగా కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

కల్పిక కొంత కాలంగా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసిందన్నారు. దీంతో ఆమెను గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించామన్నారు. అయితే, అక్కడ ఉండకుండా ఆమె తిరిగి వచ్చిందని చెప్పారు. వైద్యులు సూచించిన మెడిషన్స్కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందన్నారు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు పడుతుందన్నారు. దయచేసి ఆమెను మళ్లీ రిహాబిలిటేషన్కు తరలించాలని పోలీసులను ఆయన కోరారు.

'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది.

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు