Breaking News

నా భర్త అలాంటి సినిమాలనే ఎంచుకుంటారు: జ్యోతిక

Published on Sun, 03/24/2024 - 19:12

సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్‌ మూవీ సైతాన్‌లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది. 

సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్‌ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె‌ రోల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్‌ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు.

కాగా.. సైతాన్‌ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్‌ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి