స్వయంకృషితోనే ఛాన్స్‌ దక్కించికున్నా: జోషిణ

Published on Fri, 11/14/2025 - 07:05

సినిమాల్లో కథానాయకిగా నటించడానికి కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటి అర్హతలను కలిగిన వర్ధమాన నటి జోషిణ. ఈమె భరతనాట్యంతో పాటు, డాన్సులోనూ శిక్షణ పొందారు. అదే విధంగా బైక్‌ రైడింగ్, కార్‌ డ్రైవింగ్, గుర్రపు స్వారి, కర్రసాము వంటి వాటిలో శిక్షణ పొందారు. అదేవిధంగా కూత్తుపట్టరై కలైరాణి వద్ద డబ్బింగ్‌ చెప్పడంలోనూ శిక్షణ పొందారు. తెలుగులో నటించాలన్న ఆసక్తితో తెలుగు భాషను నేర్చుకున్నట్లు చెప్పిన నటి జోషిణ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తూ  బిజీగా ఉన్నారు. 

ఈమె తన గురించి,నటనపై ఆసక్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘ మా కుటుంబానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు . అదే విధంగా సినిమా రంగంలో తనకు తెలిసిన వారు ఎవరు లేరు. ఒక దశలో సినిమాపై నాకు ఆసక్తి ఏర్పడింది. దీంతో వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. అలా స్వయంకృతోనే నటిగా ప్రకాశించాలని భావించాను. అదృష్టం అనేది పరిచయం వరకే పని చేస్తుంది. ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే , ప్రతిభ, నిరంతర శ్రమ అవసరం అవుతుంది. అందుకు తగిన శిక్షణ అవసరం అవుతుంది’’ అని నటి జోషిణ పేర్కొన్నారు. 

ఈమె ప్రస్తుతం కిషోర్‌ మత్తురామలింగం దర్శకత్వంలో నటించిన మిడిల్‌ క్లాస్‌ చిత్రం ఈనెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో నటుడు రాధా రవికి కూతురుగా నటించారు. అదేవిధంగా  వెట్రి మహాలింగం దర్శకత్వంలో సూట్‌ కేస్‌ చిత్రంలోను నటిస్తున్నారు. ఇక నటుడు సెమ్మలర్‌ అన్నం దర్శకత్వం  వహిస్తున్న మరో చిత్రంలోనూ తాను కథానాయకిగా నటించబోతున్నట్లు జోషిణ చెప్పారు.  

Videos

Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...

Global Silence: 8 లక్షల మంది బలి

Nidadavolu: టీడీపీ బెల్ట్ షాపుల దందా.. బాటిల్‌పై అదనంగా రూ.30 వసూలు

ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు

విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య

అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు

పవన్ కల్యాణ్‌కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)