Breaking News

నాకు.. నరేశ్‌కి ఆ అదృష్టం దక్కింది

Published on Tue, 05/23/2023 - 01:55

‘‘చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ నాకు, నరేశ్‌కు ఆ అదృష్టం దక్కింది. విజయనిర్మలగారు ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా నన్ను, నరేశ్‌లను పరిచయం చేశారు. మన వ్యక్తిగత విషయాల పరంగా ఎవరికీ భయపడక్కర్లేదు’’ అని నటి జయసుధ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్‌ జంటగా ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్‌పై వీకే నరేశ్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలకానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ను జయసుధ విడుదల చేశారు. నటిగా యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధను నరేశ్‌ సత్కరించగా, నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నరేశ్‌ ఎమ్మెస్‌ రాజు ఆధ్వర్యంలో జయసుధ సత్కరించారు. వీకే నరేశ్‌ మాట్లాడుతూ–‘‘నా రీల్‌ లైఫ్‌ బాగున్నా రియల్‌ లైఫ్‌ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ (విజయ నిర్మల) తర్వాత ఇంకో అమ్మను (పవిత్ర) కలుసుకున్నాను.

జీవితంలో ఫస్టాప్‌ కంటే సెకండాఫ్‌ బాగుండా లని చెప్పే చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’’ అన్నారు. ‘‘నా కొత్త జీవితం ప్రారంభమైంది. ‘మళ్ళీ పెళ్లి’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు రాజుగారు, నరేశ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు పవిత్రా లోకేశ్‌. ‘‘నా 12 ఏళ్లప్పుడు విజయ కృష్ణ మూవీస్‌లో ‘మీనా’ సినిమా చూశాను. ఇప్పుడు వారి బేనర్‌లో సినిమా చేస్తాననుకోలేదు. ‘మళ్ళీ పెళ్లి’ బోల్డ్‌ కథ’’ అన్నారు ఎమ్మెస్‌ రాజు.   
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)