Breaking News

రోజుకు 500 కాల్స్‌.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ

Published on Wed, 12/03/2025 - 14:58

సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ హేమపై గతేడాది డ్రగ్స్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని.. అదే కేసును కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని హేమ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈ కేసుపై స్పందిస్తూ.. డ్రగ్స్‌ తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందన్నారు.

‘నేను డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పడం వందశాతం అబద్దం. కానీ బర్త్‌డే పార్టీకి వెళ్లింది నిజం. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ నేను డ్రగ్స్‌ తీసుకోలేదు. ఆ పార్టీకి అందరూ  ఫ్యామిలీతో వచ్చారు. అది రేవ్‌ పార్టీ కాదు.. వందశాతం బర్త్‌డే పార్టీనే. నేను పార్టీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్‌ దొరికింది. 

కానీ మీడియా మొత్తం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన హేమ రాసేసింది. ఇది చూసి నాకు తెలిసివాళ్లంతా ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాకు రోజుకు 500 పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అందరికి సమాధానం చెప్పాను. ఇక ఫోన్‌ కాల్స్‌ వల్ల వచ్చే తలనొప్పి భరించలేక.. ఓ వీడియో తీసి పెట్టాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు’ అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)