పశ్చాత్తాపం లేదు.. విడాకులపై స్పందించిన హన్సిక

Published on Fri, 04/17/2026 - 16:42

తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ హన్సిక.. గత నెలలో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ భర్త సొహెల్ కతురియా నుంచి విడిపోయింది. అధికారికంగా ఈమె ఈ విషయం బయటపెట్టనప్పటికీ.. ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మార్చి 11న పరస్పర అంగీకారంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తొలిసారి హన్సిక.. విడాకుల గురించి స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)

'ప్రజలకు కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్. అవి వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ ఏ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఇందులో(విడాకులు తీసుకోవడంలో) నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను మానసికంగా బాగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, శ్రేయస్సే ముఖ్యం. విడాకుల కారణాలు పూర్తిగా వ్యక్తిగతం. అవి మా మధ్యే ఉండాలి. ఈ కష్ట సమయంలో తల్లి, సోదరుడు అండగా నిలిచారు. విడాకులు తర్వాత విశ్రాంతి కోసం జపాన్ వెళ్లొచ్చాను' అని హన్సిక చెప్పుకొచ్చింది.

బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, టీనేజీలోనే 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేసింది. 2022 డిసెంబరులో సొహెల్ కతురియాని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఈమె వివాహాన్ని.. 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరిట ఓటీటీలోనూ విడుదల చేశారు. కానీ ఇప్పుడు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. హన్సిక స్నేహితురాలితోనే తొలుత సొహెల్‌కి వివాహమైంది. ఆమెకి విడాకులిచ్చేసిన తర్వాత హన్సికని పెళ్లాడాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.

(ఇదీ చదవండి: చెల్లి ఆలియా భట్ పెళ్లయిన నాలుగేళ్లకు అక్క ఎంగేజ్‌మెంట్‌)

Videos

ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్

మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR

అంబటి రాంబాబు నిరాహార దీక్ష

ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్

దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్

మోదీకి బిగ్ షాక్.. పార్లమెంట్ లో ఎదురుదెబ్బ..

జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!

కూకట్ పల్లిలో ఘోర బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?

Photos

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)