Breaking News

అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!

Published on Mon, 01/05/2026 - 14:13

రాత్రికి రాత్రే ఫేమస్‌ అయినవారిలో మరాఠి నటి గిరిజ ఓక్‌ ఒకరు. ఈమె నటిగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ చిన్న ఇంటర్వ్యూ క్లిప్‌ వల్ల సడన్‌గా ఒక్క రోజులోనే వైరల్‌ అయిపోయింది. అందులో ఆమె నీలిరంగు చీర కట్టుకుని సింపుల్‌గా కనిపించింది. ఈ వైరల్‌ ఫేమ్‌ వల్ల తన సినిమాలు ఎక్కువమంది చూస్తే చాలని ఆశపడుతోంది.

అమ్మ గురించి ఎప్పుడూ..
తాజాగా తొలిసారి ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. నేను మా అమ్మ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇన్ని గంటలు మాత్రమే పనిచేయాలనే నిబంధన అంటూ ఏమీ ఉండదు. దానివల్ల నేను కొన్నిసార్లు 10-12 గంటలపాటు షూటింగ్‌లో ఉండేదాన్ని. కొన్నిసార్లు 16 గంటలపాటు ప్రయాణించి సెట్‌కు వెళ్లేదాన్ని.

ఒంటరిగానే..
పెళ్లికి ముందు, తర్వాత కూడా ఒంటరిగానే వెళ్లేదాన్ని. కానీ రోజంతా పనిచేసి ఇంటికొస్తే.. ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ నాతో ఎందుకు లేదు? అనిపించేది. ఆమె నాతో లేకపోవడానికి ఓ కారణం ఉంది. నా పెళ్లవడానికి ముందే తను రెండో పెళ్లి చేసుకుంది. అయితే నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోవడం అస్సలు తట్టుకోలేకపోయాను. సైకియాట్రిస్ట్‌ను కలిశా.. 17 ఏళ్ల వయసులోనే తొలిసారి థెరపీ తీసుకున్నాను. కొన్నేళ్లపాటు ఆ థెరపీలు కొనసాగించాను. 

సాక్షి సంతకం
సినిమా షూటింగ్స్‌కు వెళ్లొచ్చాక ఇంట్లో అంతా నిశ్శబ్ధంగా ఉండేది. అమ్మ నాతో ఉంటే.. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా భోజనం సిద్ధం చేసేది, నాతో కబుర్లు చెప్పేదని ఫీలయ్యేదాన్ని.. తనను బాగా మిస్‌ అయ్యేదాన్ని! ఏదేమైనా అమ్మ తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. ఆ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అమ్మ ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. తన రెండో పెళ్లికి నేను సాక్షి సంతకం పెట్టాను అని చెప్పుకొచ్చింది. గిరిజ ఓక్‌.. హిందీలో తారే జమీన్‌పర్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, జవాన్‌, ద వ్యాక్సిన్‌ వార్‌, ఇన్‌స్పెక్టర్‌ జిండె వంటి చిత్రాల్లో నటించింది. మరాఠిలో అనేక చిత్రాలు చేసింది.

చదవండి: చెల్లి పెళ్లిలో డ్యాన్స్‌.. పైసా ఇవ్వలేదు: హీరో

Videos

హైదరాబాద్ నడిబొడ్డున బయటపెడతా.. ఏంటి తమాషాలా..

సుమతో అనిల్ రావిపూడి కామెడీ.. పడి పడి నవ్విన చిరంజీవి

సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్

భయపడకు నేనున్నా.. వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు

తాజా రాజకీయ పరిణామాలపై నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఎన్ని ప్రాణాలు పోయినా.. ఐ డోంట్ కేర్! నాకు భూములు కావాల్సిందే!!

అడ్డగోలు దోపిడీ.. సంక్రాంతికి ట్రావెల్స్ టికెట్ బాంబు

టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వైఎస్ జగన్ కు వివరించిన బొమ్మనహాళ్ ఎంపీటీసీలు

లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు

చిరు కోసం బాబీ మాస్టర్ ప్లాన్..! అదే నిజమైతే..

Photos

+5

'మన శంకర వరప్రసాద్‌గారు' ప్రీరిలీజ్‌లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)

+5

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)

+5

సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ క్యూట్ మెమొరీస్ (ఫొటోలు)

+5

మాయాబజార్ సావిత్రి లుక్‌లో యాంకర్ సుమ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ ఫారిన్ ట్రిప్‌ (ఫొటోలు)

+5

‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మృణాల్‌ (ఫొటోలు)

+5

తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)