Breaking News

నాకు జాతీయ అవార్డు వస్తే అదే సంతోషం: నటి

Published on Sun, 11/09/2025 - 08:34

తమిళ నటి గీత కైలాసం ప్రధాన పాత్రను పోషించిన చిత్రం అంగమ్మాల్‌. చరణ్, భరణి, ముల్లైయరసీ, తెండ్రల్‌ రఘునాథన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్‌ సంస్థ సమర్పణలో ఎంజాయ్‌ ఫిలిమ్స్, ఫిరో మూవీ స్టేషన్‌ సంస్థల అధినేతలు ఫిరో రహీం, ఎంజాయ్‌ సామ్యువేల్‌ కలిసి నిర్మించారు. దీనికి విపిన్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వం వహించారు. రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన కొడిమణి అనే కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 21న తెరపైకి రానుంది. 

ఓటీటీలో కాకుండా థియేటర్‌లో..
ఈ క్రమంలో దర్శకుడు విపిన్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. సత్యమంగళం అటవీ ప్రాంతంలో చిత్ర షూటింగ్‌ పూర్తి చేశామన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను గీత కైలాసం పోషించారని, ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు. చిత్రాన్ని  ఓటీటీలో  కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలన్న భావనతో.. అన్ని వర్గాల వారికి చేరాలన్న ఉద్దేశంతో జనరంజకంగా రూపొందించినట్లు చెప్పారు. 

అవార్డు వస్తే సంతోషం
గీత కైలాసం మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తన పాత్ర కొత్తగా ఉందనిపించి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు తనకు జాతీయ అవార్డు వస్తుందని అన్నారని, అలాంటి అవార్డు వస్తే తనకు చాలా సంతోషమేనని అన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న సంస్థ అధినేతల్లో ఒకరైన సంతానం కార్తికేయన్‌ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగమ్మాల్‌ చిత్రం జనరంజకంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

చదవండి: 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)