Breaking News

చిన్న వయసులోనే కన్నుమూసిన ప్రముఖ బాలనటి

Published on Thu, 06/18/2026 - 17:20

హాలీవుడ్ ప్రముఖ నటి డేవీ ఛేజ్ చనిపోయింది. 35 ఏళ్ల వయసుకే ఈమె నూరేళ్లు నిండిపోయాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డేవీ మృతి చెందినట్లు ఈమె మేనేజర్ జాన్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. మెనింజైటిస్ కారణంగా వచ్చిన సెప్సిస్‌తో ఈమె చనిపోయినట్లు పేర్కొన్నారు. మరణానికి ముందు పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చేరినట్లు ఈయన పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

డేవీ ఛేజ్.. నాలుగేళ్లకే యాక్టర్‌గా మారింది. ఏడేళ్ల వయసులోనే హాలీవుడ్‌లో తొలి అవకాశం దక్కించుకుంది. అమెరికన్ సిట్‌కామ్ 'సబ్రినా ది టీనేజ్ విచ్' షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం డోనీ డార్కో, ఎస్ డార్కో చిత్రాల్లో నటించింది. అయితే 2002లో రిలీజైన హారర్ మూవీ 'ద రింగ్' మూవీలో సమారా మోర్గాన్ అనే పాత్రతో భయపెట్టింది. టీవీ నుంచి బయటకొస్తూ భయపెట్టే ఆ పాత్ర చాలామంది ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.

2002లో రిలీజైన యానిమేషన్ మూవీ 'లిలో & స్టిచ్'లో లిలో పాత్రకు డబ్బింగ్ చెప్పి డేవీ గుర్తింపు అందుకుంది. పలు అవార్డులు కూడా ఈమెని వరించాయి. తర్వాత కాలంలో చార్మ్డ్, ఈఆర్, టచ్డ్ బై యాన్ ఏంజెల్ తదితర వెబ్ సిరీస్‌ల్లో అతిథి పాత్రలు చేసింది. బిగ్ లవ్ సిరీస్‌లో రొండా వోల్మర్ పాత్రలో 32 ఎపిసోడ్‌ల పాటు కనిపించింది. 2015 తర్వాత నటనకు పూర్తిగా దూరమైన డేవీ ఛేజ్.. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఇలా అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేసింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)