మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్‌డే మనవరాలిదైతే బహుమతులు..!

Published on Sat, 11/01/2025 - 10:26

బుల్లితెర నటి చారు అసోపా భర్తకు విడాకులిచ్చి కూతురితో ఒంటరిగా బతుకుతోంది. సింగిల్‌ పేరెంట్‌ అయిన తనకు ముంబైలో ఇల్లు దొరక్క, సరైన సంపాదన లేక.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పుట్టింటికి వెళ్లిపోయింది. నటనకు బ్రేక్‌ ఇచ్చి చీరల బిజినెస్‌ చేస్తోంది. పుట్టింట్లో ఉండిపోకుండా కొత్తిల్లు కట్టుకుని కూతురు జియానాతో కలిసి జీవిస్తోంది.

నటి కోసం వచ్చిన మాజీ మామ
తాజాగా చారు అసోపా (Charu Asopa)ను ఆమె మాజీ మామ కలిశాడు. బికనీర్‌లో తనింటికి తొలిసారి వెళ్లాడు. మనవరాలి బర్త్‌డే కోసం కానుకల్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. మనవరాలికే కాకుండా మాజీ కోడలి కోసం కూడా గిఫ్టులు కొనుగోలు చేశాడు. మామ వస్తున్నాడని తెలిసి ఇంటిని అందంగా ముస్తాబు చేసింది చారు. విమానాశ్రయానికి వెళ్లి అతడికి సాదర ఆహ్వానం పలికింది. తర్వాత డిన్నర్‌ కోసం ప్యాలెస్‌కు తీసుకెళ్లింది. ప్యాలెస్‌లో నచ్చిన విందు ఆరగించాక.. అక్కడి ఫోక్‌ డ్యాన్సర్లతో కలిసి చారు, జియానా స్టెప్పులేశారు.

పెళ్లి- విడాకులు
బుల్లితెర నటి చారు అసోపా.. హీరోయిన్‌ సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు జియానా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంత సర్దుకుపోదామన్నా అవి తగ్గకపోగా, పెద్దవి కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న మొదట్లో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. కోపావేశాలు చల్లారాక ఫ్రెండ్స్‌ అయిపోయారు. రాజీవ్‌, చారు, జియానా.. ఆ మధ్య నగరాలు, దేశాలు చుట్టేస్తూ సరదాగా గడిపారు. ఇప్పటికీ ఒక ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉంటున్నారు.

 

 

చదవండి: శ్రీజ ఎలిమినేట్‌, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)