Breaking News

ఈ టాలీవుడ్ బోల్డ్ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?

Published on Wed, 07/29/2026 - 20:46

సినిమా తారలు ఫేమ్ ఉన్నన్నీ రోజులు అటు తెరపై ఇటు బయట తెగ కనిపిస్తారు. సినిమాలు తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలియనంతగా మాయమైపోతారు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత కనిపించినప్పుడు వీళ్లు వాళ్లేనా అనే సందేహం రాకమానదు. అంతలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాకిస్తారు. ఇప్పుడు అలానే టాలీవుడ్ బోల్డ్ నటి ప్రస్తుత ఫొటో వైరల్ అవుతోంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)

పైన ఫొటోలో కనిపిస్తున్న నటి భువనేశ్వరి. 1999-2015 మధ్య తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు సీరియల్స్ కూడా చేసింది. ఎక్కువగా వ్యాంప్/బోల్డ్ పాత్రలే పోషించడం వల్ల ఆ ఇమేజీ ఈమెకు ఉండిపోయింది. అయితే తెరపై ఈమె పాత్రల సంగతేమో గానీ నిజ జీవితంలోనూ ఈమె చాలానే వివాదాల్లో ఇరుక్కుంది. అలానూ వార్తల్లో హల్‌చల్ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో పుట్టిన భువనేశ్వరి.. తొలుత తమిళ సీరియల్, సినిమాలతో నటిగా మారింది. శ్రీకాంత్ 'దొంగరాముడు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను, నువ్వంటే నాకిష్టం, చక్రం, భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, భూ కైలాష్, హలో ప్రేమిస్తారా, సీమ శాస్త్రీ, కుబేరులు, కృష్ణార్జున, ఆంజనేయులు తదితర మూవీస్ చేసింది. అయితే డైరెక్టర్ శంకర్ తీసిన 'బాయ్స్' ఈమెకు అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఒక పక్క నటిగా రాణిస్తూనే, మరోపక్క రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం ఈ నటి జీవితాన్ని వివాదాల మయం చేసింది. వ్యభిచారం కేసుల్లో మూడుసార్లు అరెస్టవ్వడం అప్పట్లో సంచనలంగా మారింది. 2009లో అరెస్ట్ అయినప్పుడు కోర్టులో ఈమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కేవలం నన్నే ఎందుకు పట్టుకుంటున్నారు? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న వారు కూడా ఇదే పని చేస్తున్నారు కదా అని ఈమె ప్రశ్నించడం కోలీవుడ్ పెద్దలని షాక్‌కి గురిచేసింది.

భర్త వదిలేసి వెళ్లడం, కొడుకు మిథున్ శ్రీనివాసన్ కూడా కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం నటి భువనేశ్వరిని మరింత మానసిక వేదనకు గురిచేశాయి. ప్రస్తుతానికైతే తమిళనాడులోని ఏఐఎమ్ఎమ్‌కే పార్టీలో ఉంది. ప్రస్తుతం రాజకీయంగా అడపాదడపా బిజీగా ఉంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా మారిపోయి కనిపించింది.

(ఇదీ చదవండి: గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)