Breaking News

ఇదేం పాడుబుద్ధి.. డాక్టర్‌ని ఇంటికి పిలిపించుకుని

Published on Fri, 11/06/2026 - 11:43

వాళ్లిద్దరూ తెరపై నటులు. నిజజీవితంలో మాత్రం దొంగలు. ఈ విషయం తెలిసి తోటీ యాక్టర్స్ అవాక్కవుతున్నారు. తెలుగు హిట్ సినిమా 'మత్తు వదలరా'తో నటిగా మారిన మలయాళ బ్యూటీ అతుల్య చంద్ర.. ఆపై సొంత భాషలో మూండ్ర కన్, ఉయిర్, డైస్ ఈరే మూవీస్ చేసింది. ఇప్పుడు ఏమైందో ఏమో తెలీదు గానీ ఓ డాక్టర్‌ని ఇంటికి పిలిపించుకుని అతడిని దోచేసింది. ఈమెకు మరో నటుడు సాయం చేశాడు.

(ఇదీ చదవండి: 'రామాయణ' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)

కేరళలోని కొచ్చిలో అతుల్య చంద్ర.. నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లితో కలిసి సోమవారం, తన అపార్ట్‌మెంట్ నుంచి స్థానిక వైద్యుడికి ఫోన్ చేసింది. తన బంధువుకి అత్యవసర వైద్యసాయం అందించేందుకు ఇంటికి రావాలని ఆయనతో చెప్పారు. ఉదయం ఆరున్నరకు డాక్టర్.. వాళ్ల ఫ్లాట్‌కి వెళ్లేసరికి అక్కడ మొత్తం 12 మంది యువతీయువకులు ఉన్నారు. వీళ్లంతా కలిసి సదరు డాక్టర్‌పై దాడి చేశారు.

వైద్యుడి దగ్గరున్న ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ లాక్కుని.. ఇదంతా పోలీసులకు చెబితే వైద్యం కోసమని వచ్చి, తమ బంధువుపై అత్యాచారానికి ప్రయత్నించావని కేసు పెడతామని బెదిరించారు. కొన్ని గంటల తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న డాక్టర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయటపడింది. ఇద్దరు నటలుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వాళ్లకోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఈ డాక్టర్‌ని ఎందుకు పిలిచారు? వీళ్ల ఉద్దేశం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ముకేశ్‌పై దేబ్జానీ ప్రతీకారం.. త్రిగుణ్ ఎమోషనల్)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)