Breaking News

విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్‌ వైరల్‌

Published on Fri, 09/12/2025 - 13:17

హీరోయిన్‌ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్‌ సెట్‌ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోయిన్‌ ఓరియెంటేడ్‌ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. క్రిష్‌ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్‌ రాసి ట్వీట్‌ చేశారు.

కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు..  సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు.

క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.

Videos

Byreddy: మీ యాక్షన్ కు మా రియాక్షన్... మీ ఊహకే వదిలేస్తున్నా

Renu Agarwal Case: హంతకులు ఎలా దొరికారంటే..?

Renu Agarwal Case: హంతకులు ఎలా దొరికారంటే..?

Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్

Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!

Penna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది, పెన్నా నది

Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు

చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

Photos

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)