కేరవాన్‌లో ఫుల్లుగా ఏడ్చేదాన్ని.. తర్వాత నవ్వుతూ..: అనన్య

Published on Fri, 06/20/2025 - 19:27

ప్రేమలో మోసపోయానంటోంది తెలుగు హీరోయిన్‌ అనన్య నాగళ్ల (Ananya Nagalla). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు బ్రేకప్‌ జరిగింది. ఆ సమయంలో నా మనసుకు, మెదడుకు, చేతలకు సంబంధమే లేకుండా పోయింది. అతడికి ఫోన్‌ చేయడం ఇష్టం లేకపోయినా నాకు తెలీకుండానే ఫోన్‌ చేసేవాడిని. ఎందుకు చేశానో అర్థమయ్యేది కాదు. రెండు, మూడేళ్లపాటు చాలా బాధపడ్డాను. 

కేరవాన్‌లో ఏడ్చేసి..
కానీ, చేసే పనిపై దాని ప్రభావాన్ని పడనివ్వలేదు. రాత్రంతా ఏడ్చి ఉదయాన్ని జిమ్‌కు వెళ్లిపోయేదాన్ని. కేరవాన్‌లో ఏడ్చేసి.. ఏం జరగనట్లు కళ్లు తుడుచుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని. ఈ బాధలో నుంచి బయటకు వస్తానా? లేదా? అనుకున్నాను. తర్వాత ఇదంతా ఒక మాయ అని తెలుసుకుని బయటపడ్డాను అని తెలిపింది.

తెలుగమ్మాయికి అవకాశాలు తక్కువ?
తెలుగమ్మాయిలకు వస్తున్న అవకాశాల గురించి అనన్య మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్‌. హిట్స్‌ వస్తేనే మార్కెట్‌ పెరుగుతుంది, అప్పుడే హీరోయిన్లను సినిమాలో పెట్టుకుంటారు. వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగింది. మంచి ప్రాజెక్ట్స్‌ ఇచ్చారు. కానీ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడితే వచ్చినన్ని అవకాశాలు.. తెలుగమ్మాయి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడితే రావట్లేదు. ఇదే నిజం. హిట్స్‌ ఉన్నా ఎందుకు మంచి అవకాశాలు రావడం లేదని కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నాకోసం నేను మార్కెటింగ్‌ చేసుకోవడం మొదలుపెట్టాను. 

నాకు నేనే మార్కెటింగ్‌
సినిమాల్లో యాక్ట్‌ చేసి వదిలేయకుండా వాటి ప్రమోషన్స్‌పై ఎక్కువగా ఫోకస్‌ చేశాను. దానివల్ల నాకంటూ ఫీమేల్‌ ఓరియంటెడ్‌ స్క్రిప్టులు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఉమెన్‌ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన అనన్య.. వకీల్‌ సాబ్‌, తంత్ర, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించింది. పొట్టేల్‌ సినిమాకుగానూ గద్దర్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకుంది.

చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)