Breaking News

భావోద్వేగాలు బలంగా ఉంటాయి: అనంతిక సనిల్‌కుమార్‌

Published on Tue, 09/01/2026 - 00:03

‘‘రోమాంచకం’ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఈ మూడు భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమవల్లే అవుతుంది. అది ఎలా జరిగింది? అనేది సినిమాలోనే చూడాలి. నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ‘రోమాంచకం’లో నా క్యారెక్టర్‌ ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంత సరదాగా, సంతోషంగా చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాను’’ అని హీరోయిన్‌ అనంతిక సనిల్‌కుమార్‌ తెలిపారు. 

సుమంత్‌ ప్రభాస్, అనంతిక జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌పై ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో అనంతిక సనిల్‌కుమార్‌ మాట్లాడుతూ–‘‘8 వసంతాలు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నప్పటికీ ఎగై్జటింగ్‌గా అనిపించలేదు. ‘రోమాంచకం’ కథ విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్, సరదాగా ఉండే తమిళ అమ్మాయిగా కనిపిస్తా. 

ఇది ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్‌ చేస్తారు. సుమంత్‌ ప్రభాస్‌ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ కూడా ఆయనతో పోటీ పడేలా తీర్చిదిద్దారు డైరెక్టర్‌ వేణుగోపాల్‌గారు. సందీప్‌ రెడ్డి వంగా, ప్రణయ్‌ రెడ్డిగార్లు నా పాత్ర చాలా బాగా వచ్చిందని అభినందించడం సంతోషం. అయితే ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్ బేస్డ్‌ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా.        తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)