Breaking News

మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌

Published on Tue, 03/25/2025 - 10:52

నటి అమీ జాక్సన్‌ మరోసారి తల్లయ్యారు. రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించారు. 2019లో జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో డేటింగ్‌ చేసిన అమీ జాక్సన్‌.. వారి ప్రేమకు గుర్తుగా 'ఆండ్రూ' అనే బాబుకు జన్మనిచ్చారు. ఆయనతో విడిపోయిన తర్వాత  హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ (Ed Westwick)ను  నటి అమీ జాక్సన్‌ (Amy Jackson) ప్రేమించి గత ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది.  ఇప్పుడు ఈ దంపతులకు జన్మించిన బిడ్డకు  'ఆస్కార్‌ అలెగ్జాండర్‌' అని నామకరణం చేశారు.

చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్‌ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ  పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది. 

ఇంతలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.  ఈ క్రమంలోనే హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ను ప్రేమించి 2024లో వివాహ బంధంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఆమె జీవిత ప్రయాణం సంతోషంగా ఉంటుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)