Breaking News

ఆ నిర్మాతకు రూ. 2.75 కోట్లు రిటర్న్‌ చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌

Published on Sat, 03/09/2024 - 11:36

రాంచీకి చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ నుంచి తాను తీసుకున్న రూ.2.50 కోట్లకు వడ్డీతో కలిపి రూ. 2.75 కోట్లు తిరిగి చెల్లిస్తానని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలిపింది. చెక్ బౌన్స్, మోసం కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి అమీషా పటేల్ చిత్ర నిర్మాత అజయ్ కుమార్ సింగ్‌కు డబ్బు చెల్లించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. రాంచీ కోర్టు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆమె ఒప్పుకుంది.

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అజయ్‌ కుమార్‌ ఓ సినిమా విషయంలో చాలా నెలల క్రితం అమీషా పటేల్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అప్పుగా అమీషా పటేల్‌ తీసుకున్నారని.. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్‌ కోర్టులో పిటిషన్‌ ఆయన వేశారు. వడ్డీతో కలిసి మొత్తం రూ.3కోట్లు అయిందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బును ఇప్పించాలని కోర్టును కోరారు.

ఈ కేసు విషయంలో తాజాగా అమీషా పటేల్‌ తన లాయర్‌ ద్వారా డబ్బు చెల్లించేందుకు అంగీకరించింది.  అయితే మొదటి విడతగా రూ.20 లక్షలు చెల్లిస్తామని లాయర్‌ ద్వారా కోర్టుకు తెలిపింది. కోర్టు వర్గాల సమాచారం ప్రకారం, అమీషా పటేల్ మొదటి విడత మొత్తాన్ని మరో రెండు మూడు రోజుల్లో అందించనున్నట్లు తెలిపింది. అంతకుముందు, కోర్టు స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది. అయితే వ్యక్తిగత విధుల కారణంగా కోర్టుకు హాజరుకాలేనని అమీషా పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)