Breaking News

గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు

Published on Mon, 08/03/2026 - 11:47

హిందీ సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నటి అదితి శర్మ.. భర్త అభినీత్ కౌశిక్, అత్తింటి వారిపై గృహహింస కేసు పెట్టింది. ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. భర్త తనని శారీరకంగా మానసికంగా వేధించాడని, వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసేవాడని, తన నగలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)

అదితి శర్మ చెప్పినదాని ప్రకారం.. 2021 జూన్‌లో ఆన్‌లైన్ యాక్టింగ్ క్లాసుల ద్వారా అభినీత్ కౌశిక్‌తో పరిచయం ఏర్పడింది. 2024 సెప్టెంబర్‌ నుంచి ఇద్దరూ కలిసి బతకడం మొదలుపెట్టారు. అదే ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని  చిన్న చిన్న విషయాలకే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, నా డ్రస్సింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడని, తన దగ్గర నుంచే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించింది.

2025 జనవరిలో కాఫీ విషయంలో జరిగిన ఓ గొడవ పెద్దది కావడంతో తనను దారుణంగా తిట్టారని, వివాహేతర సంబంధం కూడా అంటగట్టారని అదితీ తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. తన మొబైల్ తరచూ చెక్ చేయడం, తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకోవడం లాంటివి కూడా అత్తింటివాళ్లు చేశారని తెలిపింది. తన మంగళసూత్రం, బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, గాజులు తదితర వివాహ ఆభరణాలని అడిగినా తనకు ఇవ్వట్లేదని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో)

ఈ ఏడాది మార్చిలో అదితీ భర్త అభినీత్, అతడి తరఫు న్యాయవాది ఈమెపై పలు ఆరోపణలు చేశారు.'అపోల్లెనా' సీరియల్ సహనటుడు సమర్థ్య గుప్తాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గుర్తించడంతోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అదితి తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, ఇండస్ట్రీలో ఇది బయటపడకూడదనే ఉద్దేశంతో తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలని కోరిందని అభినీత్ పేర్కొన్నాడు. కుటుంబాల మధ్య రాజీ చర్చల సందర్భంగా రూ.25 లక్షలు, విడాకులు కోరినట్లు కూడా ఆయన ఆరోపించాడు.

భర్త ఆరోపణలపై స్పందించిన అదితి.. పెళ్లైన నెల రోజుల నుంచే తనని చాలా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయాలు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున పూర్తి వివరాలు మాట్లాడలేనని చెప్పింది. గృహహింస తన వైపు నుంచి జరగలేదని స్పష్టం చేసిన ఈమె.. తన భర్త తనని, తన కుటుంబాన్ని పలుమార్లు అవమానించారని, అందుకే విడాకులు కోరినట్లు పేర్కొంది. తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలనే నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)