Breaking News

అలాంటి సినిమా చేయాలనుంది.. కోరిక బయటపెట్టిన అదితి శంకర్‌

Published on Sat, 09/27/2025 - 10:21

సినిమా రంగుల ప్రపంచం.. ఆశల పల్లకి. ఇందులో గొప్పగా రాణించాలన్న ఆశ నటీనటులకు ఉంటుంది. అందుకోసం ఉన్నత ఉద్యోగాలను, వృత్తిని పక్కనపెట్టినవారున్నారు. హీరోయిన్‌ అదితి శంకర్‌ (Aditi Shankar) కూడా అదే కోవకి చెందుతుంది. స్టార్‌ దర్శకుడు శంకర్‌ కూతురే అదితి. ఈమె వైద్య విద్యలో పట్టభద్రురాలు. అయినప్పటికీ సినిమాపై ఆసక్తితో కథానాయికగా రంగప్రవేశం చేసింది. విరుమాన్‌ చిత్రంతో సినిమా కెరీర్‌ మొదలుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరువాత మావీరన్‌ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. 

టాలీవుడ్‌లో బోర్లాపడ్డ బ్యూటీ
ఈమె నటించిన మూడో చిత్రం నేశిప్పాయా పూర్తిగా నిరాశపరచింది. నాలుగో చిత్రం భైరవంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భైరవం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలా 2022లో హీరోయిన్‌గా పరిచయమైన అదితి శంకర్‌ ఈ నాలుగేళ్లలో చేసిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఐదో చిత్రం ఒన్స్‌ మోర్‌ నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

మోడ్రన్‌ లుక్‌లో..
అదితి శంకర్‌ లంగా ఓణీ ధరిస్తే పక్కింటి అమ్మాయిలా, మోడ్రన్‌ దుస్తులు ధరిస్తే ఈ తరం అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ పూర్తిగా మోడ్రన్‌ యువతి పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. అయితే అలాంటి పాత్రలో నటించాలన్న ఆశ ఉందనే అభిప్రాయాన్ని తాజాగా అదితి వ్యక్తం చేసింది. ఒక సమావేశంలో అదితి శంకర్‌ మాట్లాడుతూ.. తండ్రిని చూసి చిన్నతనంలోనే నటినవ్వాలన్న కోరిక బలంగా కలిగిందని తెలిపింది.

అలాంటి సినిమా చేయాలనుంది
తన ఆశను త్రండి శంకర్‌కు చెప్పగా ముందు చదువు పూర్తి చేయమని చెప్పారంది. దీంతో తనకు ఇష్టమైన వైద్య విద్యను ఎంపిక చేసుకుని దాన్ని కంప్లీట్‌ చేశానంది. ఆ తరువాత తనకు నచ్చిన సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, నటిగా సక్సెస్‌ కాకపోతే తిరిగి వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు చెప్పానని పేర్కొంది. ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపింది. తనకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది ఆశ అని, అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.

 

చదవండి: నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్‌ ధరించా: రాణీ

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)