Breaking News

అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?

Published on Sun, 04/06/2025 - 09:22

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్‌)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్‌ బిజీగా ఉన్నారట. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్‌లోనే ఎక్కువగా పాపులర్‌ అయింది. ఇక్కడ  'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,  కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్‌లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.

అభినయ, సన్నీ వర్మల వివాహాం ఏప్రిల్‌ 16న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్‌ హాల్‌లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. అభినయ పుట్టుకతోనే మాటలు రావు, వినిపించవని తెలిసిందే. అయినప్పటికీ తన టాలెంట్‌తో సినిమాల్లో రాణించింది. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినయ పంచుకుంది. తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)