Breaking News

పెళ్లయి 8 ఏళ్లు.. బుల్లితెర జంటకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌

Published on Sat, 08/16/2025 - 17:01

బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెరీనా అబ్రహం సాహ్ని (Marina Abraham Sahni) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మెరీనా- రోహిత్‌ జంట సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నటికి డెలివరీ అయి చాలారోజులే అవుతున్నప్పటికీ కొంతకాలంగా గోప్యంగా ఉంచింది. నేడు (ఆగస్టు 16న) శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కూతురు పుట్టిందని చెప్తూ తన ఫోటోను షోర్‌ చేసింది. పాపకు 'తెయారా సాహ్ని' అని నామకరణం చేసింది. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు.. మెరీనా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రెగ్నెన్సీ జర్నీ
మెరీనా 2021లో తొలిసారి ప్రెగ్నెంట్‌ అయింది.  కానీ ఫస్ట్‌ స్కానింగ్‌లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్‌బీట్‌ వస్తుందేమోనని మూడునెలలవరకు కడుపులో శిశువును అలాగే మోసింది. డాక్టర్లు హెచ్చరించడంతో చివరకు దాన్ని తీసేయించుకుంది. 2022లో మరోసారి గర్భం దాల్చింది. అది కూడా మిస్‌క్యారేజ్‌ అయింది. ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రేమ పెళ్లి
మెరీనా పుట్టిపెరిగిందంతా గోవాలోనే! మెరీనా పదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె తల్లికి హైదరాబాద్‌లో స్కూల్‌ ప్రిన్సిపల్‌గా ఛాన్స్‌ వచ్చింది. అలా తను ఇక్కడే సెటిలైంది. మోడలింగ్‌ చేస్తున్నప్పుడు సీరియల్స్‌లో, సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అమెరికా అమ్మాయి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మెరీనా అబ్రహం. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి ధారావాహికల్లోనూ నటించింది. ఓ సినిమా టైంలో పరిచయమైన రోహిత్‌ (Rohit Sahni)తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు. మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్‌ అవగా రోహిత్‌.. టాప్‌ 5లో స్థానం సంపాదించుకున్నాడు.

 

 

చదవండి: గర్భంతో ఉండగా ప్రతిరోజు భగవద్గీత చదివా..: హీరోయిన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)