Breaking News

నా తల్లి అల్లా దగ్గరకు వెళ్లిపోయింది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Wed, 06/25/2025 - 11:07

 ప్రముఖ నటి, ‘బిగ్‌బాస్‌’ ఫేం సనాఖాన్‌( Sana Khan) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని సనాఖాన్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో తెలియజేస్తూ..ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘నా తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఇప్పుడు అల్లా వద్దకు చేరుకున్నారు’ అంటూ సనా భావోద్వేగానికి లోనయ్యారు.తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. తల్లి మరణంతో తీవవ్ర దుఖంలో మునిగిన సనాను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చారు.  అభిమానులు, సినీ ప్రముఖులు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.

సనా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం, వెబ్ సిరీస్ 'స్పెషల్ ఆప్స్' వంటి ప్రాజెక్ట్‌లతో పాటు  హింది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్‌ చేసింది. గోల్‌ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్‌ హిట్టయింది. ఈ సాంగ్‌తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. 

కల్యాణ్‌ రామ్‌ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో  గగనం, మిస్టర్‌ నూకయ్య మూవీస్‌ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమలు చేసింది. 2020లో ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్‌ సయ్యద్‌ని వివాహం చేసుకుంది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత సనా సినిమాలకు దూరంగా ఉంటుంది.


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)