Breaking News

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో

Published on Mon, 10/21/2024 - 07:22

టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి చేసేసుకున్నాడు. 'కేరింత' సినిమాతో నటుడిగా పరిచయమైన విశ్వంత్.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని అతడి భార్య భావన బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఐదు ఫొటోల్ని పోస్ట్ చేయడంతో ఈ వివాహం గురించి అందరికీ తెలిసింది.

(ఇదీ చదవండి: చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్)

సామర్లకోటకు చెందిన విశ్వంత్..  అమెరికాలో ఇంజినీరింగ్ చదువుతున్న టైంలో 'కేరింత' సినిమాలో అవకాశమొచ్చింది. దీంతో చదువు మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ మూవీ హిట్ కావడంతో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరస ఛాన్స్‌లు వచ్చాయి. అలా 'మనమంతా', 'జెర్సీ', ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించాడు.

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలోనూ విశ్వంత్ నటిస్తున్నాడు. ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే భావన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే పెళ్లి ఫొటోలేం బయటపెట్టలేదు. అయితే పలువురు నెటిజన్లు, సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)