Breaking News

'ఫిష్‌ వెంకట్‌' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో

Published on Tue, 07/08/2025 - 10:40

టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌  ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆయన సతీమణి సువర్ణతో పాటు కుమార్తె స్రవంతి వేడుకున్నారు. దీంతో తాజాగా నటుడు విశ్వక్‌షేన్‌ స్పందించి సాయం అందించారు. ఆయన పంపిన బ్యాంక్‌ చెక్‌ను ఫిష్‌ వెంకట్‌కు అందించారు. అందుకు సంబంధించిన వీడియోను షోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

సుమారు నాలుగేళ్లగా తన రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా వెంకట్‌ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో  చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలతో బయటపడాలంటే సుమారు రూ. 50 లక్షలు అవసరం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.  సినీ పెద్దలతో పాటు దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని ఆమె కోరారు.  ఈ క్రమంలో విశ్వక్ సేన్ సాయం చేశారు. రూ. 2 లక్షల బ్యాంక్‌ చెక్‌ను తన టీమ్‌ ద్వారా ఆయన పంపారు. అందుకు ఫిష్‌ వెంకట్‌తో పాటు ఆయన కుమార్తె స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.

Videos

తల్లిని దూషిస్తే ఎవరూ ఊరుకోరు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప..

గుదిబండగా మారిన నాలుగు కుంకీ ఏనుగులు

మా ఈ పరిస్థితికి హైడ్రానే కారణం

మా మామను ఆపుతారా? పెద్దారెడ్డి కోడలు మాస్ వార్నింగ్

CAG Report: ఏపీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. బాబు పాలనపై కాగ్ నివేదిక

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సీఎంను చంపేసిన Facebook

కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!

హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు

జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...

Photos

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)