Breaking News

తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తా

Published on Tue, 04/22/2025 - 11:00

తమిళ నటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుత్తా దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను విష్ణు విశాల్‌ తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నారు. నేడు వారి నాల్గొవ వివాహ వార్షికోత్సవం. సరిగ్గా ఇదే తేదీ నాడు బిడ్డకు జన్మనివడంతో ఇరు కుటుంబాల్లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. 2021 ఏప్రిల్‌ 22న పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్న వారి ప్రేమకు గుర్తుగా ఇప్పుడు ఆడబిడ్డ జన్మించింది.

విష్ణు విశాల్‌(Vishnu Vishal)  ఇలా చెప్పుకొచ్చాడు. మాకు ఒక ఆడపిల్ల జన్మించింది.. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈరోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకున్నాము. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాతో ఉండాలి.' అని ఆయన రెండు ఫోటోలు పోస్ట్‌ చేశారు.

జ్వాలా గుత్తా(Jwala Gutta) 2005లో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను వివాహం చేసుకుని, సుమారు ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. విష్ణు విశాల్‌ కూడా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌ను 2011లో పెళ్లి చేసుకున్నాడు. పలు విబేదాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే.. విష్ణు, రజనీ దంపతులకు  ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు. విష్ణు విశాల్ చివరిసారిగా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రంలో కనిపించాడు.  ప్రస్తుతం అతను ఇరండు వానం, మోహన్దాస్, ఆర్యన్ చిత్రాలలో నటిస్తున్నాడు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)